తుప్పు పట్టిన కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం
కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన తనిఖీల్లో 200 మి.లీ. కూల్‌డ్రింక్ గాజు సీసాల మూతల వద్ద తుప్పు పట్టినట్లు ఆహార భద్రతా శాఖ అధికారులు గుర్తించారు. అదే ఉత్పత్తికి చెందిన ఇతర సీసాల్లోనూ ఇదే సమస్య కనిపించడంతో, సరఫరా చేస్తున్న పంపిణీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ సుమారు 60 కేసుల 200 మి.లీ. గాజు సీసాల మూతల వద్ద తుప్పు ఉన్నట్లు గుర్తించి, నిబంధనల ప్రకారం మొత్తం 60 కేసుల నిల్వను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత...