కొత్తసోముల చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం

రూ.కోటి డీఎంఎఫ్‌ నిధులతో పనులు.. భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరు, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): మండలంలోని కొట్టాలచెరువు గ్రామంలో రూ.కోటి డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టనున్న కొత్తసోముల చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి పరంగా ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో నీటి వనరుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయన్నారు. డీఎంఎఫ్‌ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులకు...