CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:31 am Posted by : CHAITHANYA GALAM NEWS

కొత్తసోముల చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం

  • రూ.కోటి డీఎంఎఫ్‌ నిధులతో పనులు.. భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): మండలంలోని కొట్టాలచెరువు గ్రామంలో రూ.కోటి డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టనున్న కొత్తసోముల చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

చెరువు పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి పరంగా ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో నీటి వనరుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయన్నారు. డీఎంఎఫ్‌ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.