ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి తిరుపతి కన్నుమూత

కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం): ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సేవా దృక్పథం కలిగిన గౌరిశెట్టి తిరుపతి (86) గురువారం సాయంత్రం పరమపదించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాపార, పారిశ్రామిక, సామాజిక, విద్యా, సేవా, ఆధ్యాత్మిక రంగాల్లో అనేక ప్రతిష్ఠాత్మక బాధ్యతలు నిర్వహిస్తూ విశేష సేవలందించారు. గత 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ధర్మశాల నిర్వహణతో పాటు ప్రతిరోజూ 300 మందికి పైగా రోగులకు, వారి సహాయకులకు ఉచితంగా భోజనాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,...