ఒక్క స్పందన.. ఓ నిండు ప్రాణానికి రక్షణ

అత్యవసర సమయంలో ఓ నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి అరుదైన ఓ నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన ఉపాధ్యాయుడు చెరుకుపెల్లి మధుసూదన్‌రెడ్డి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. స్థానిక సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. మల్లవ్వకు ఓ నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరమని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు శ్రీనివాసుల సేవా సంస్థను సంప్రదించారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి వూట్కూరి వెంటనే స్పందించి మధుసూదన్‌రెడ్డిని సంప్రదించారు. పాఠశాలలో విధుల్లో ఉన్న...