CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 11:04 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఒక్క స్పందన.. ఓ నిండు ప్రాణానికి రక్షణ

  • అత్యవసర సమయంలో ఓ నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి

కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి అరుదైన ఓ నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన ఉపాధ్యాయుడు చెరుకుపెల్లి మధుసూదన్‌రెడ్డి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. స్థానిక సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. మల్లవ్వకు ఓ నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరమని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు శ్రీనివాసుల సేవా సంస్థను సంప్రదించారు.

సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి వూట్కూరి వెంటనే స్పందించి మధుసూదన్‌రెడ్డిని సంప్రదించారు. పాఠశాలలో విధుల్లో ఉన్న ఆయన విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకుని అవసరమైన పరీక్షలు, వైద్య ప్రక్రియలు పూర్తిచేసి ప్లేట్‌లెట్స్‌ దానం చేశారు. దీంతో మల్లవ్వకు సకాలంలో అవసరమైన వైద్య సహాయం అందింది.

ఆపద సమయంలో స్పందించి ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన మధుసూదన్‌రెడ్డికి మల్లవ్వ కుటుంబ సభ్యులు, శ్రీనివాసుల సేవా సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం, ప్లేట్‌లెట్స్‌ కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఆరోగ్యవంతులు ముందుకు వచ్చి రక్తదానం, ప్లేట్‌లెట్స్‌ దానం చేయాలని వారు కోరారు.