CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:27 am Posted by : CHAITHANYA GALAM NEWS

వాసవి సేవాదళ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నలుమాచు విజయ్‌

  • కరీంనగర్‌ వాసికి నియామక పత్రం అందజేత

కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన నలుమాచు విజయ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వాసవి సేవాదళ్‌ అధ్యక్షుడు మాంకాళి విజయకుమార్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

తన నియామకానికి సహకరించిన కరీంనగర్‌ జిల్లా వాసవి సేవాదళ్‌ అధ్యక్షుడు ఎలుగందుల మునీందర్‌కు నలుమాచు విజయ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సేవాదళ్‌ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.