ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సిద్దిపేట, అక్టోబర్ 1 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్లను నోటీసులు, అవసరమైన పత్రాల కోసం కార్యాలయాలకు పిలవరాదని, బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి, పత్రాలను అక్కడే స్వీకరించాలని సూచించారు. సాధారణంగా హియరింగ్ కోసం కార్యాలయాలకు పిలవరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో విచారణ నిర్వహించాలని తెలిపారు. కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6తో...