పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

మన గ్రామం–మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్‌ దబ్బెడ రజిత కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ దబ్బెడ రజిత అన్నారు. కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ‘మన గ్రామం–మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టుకుని గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛమైన, ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని...