- మన గ్రామం–మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ దబ్బెడ రజిత
కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దబ్బెడ రజిత అన్నారు. కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ‘మన గ్రామం–మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టుకుని గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛమైన, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కోరారు. గ్రామ అభివృద్ధిలో యువత చైతన్యంతో ముందుకు వచ్చి పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంపత్, ప్రభాకర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.