ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాలి.. గ్రామాల అభివృద్ధి పనులకు వేగం పెంచాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

15 రోజుల్లో మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక   కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): జిల్లాలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వేగవంతం చేసేందుకు 15 రోజుల్లో మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. మండలాల అభివృద్ధిలో ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. నూతన కలెక్టరేట్‌ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం రాత్రి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు,...