వైభవంగా ఉగ్రరథ శాంతి కార్యక్రమం…

మహబూబాబాద్, అక్టోబర్ 1(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌వీఎల్ ఫంక్షన్ హాల్‌లో బొడ్ల వెంకటయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని బొడ్ల నర్మదా రామకృష్ణ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉగ్రరథ శాంతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణ చార్యులు ఆధ్వర్యంలో వేదోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విశ్వక్సేన పూజ, కలశారాధన, సుదర్శన పూజ, అనంతరము అఖండ దీపారాధన, అంకురారోపణ హోమం, దీక్షాధారణ,, మృత్యుంజయ మహా మంత్ర జపములు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉగ్రరథ శాంతి కార్యక్రమాన్ని...