మహబూబాబాద్, అక్టోబర్ 1(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌వీఎల్ ఫంక్షన్ హాల్‌లో బొడ్ల వెంకటయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని బొడ్ల నర్మదా రామకృష్ణ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉగ్రరథ శాంతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణ చార్యులు ఆధ్వర్యంలో వేదోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా తొలుత విశ్వక్సేన పూజ, కలశారాధన, సుదర్శన పూజ, అనంతరము అఖండ దీపారాధన, అంకురారోపణ హోమం, దీక్షాధారణ,, మృత్యుంజయ మహా మంత్ర జపములు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉగ్రరథ శాంతి కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణాచార్యులు మాట్లాడుతూ….. వెంకటయ్య గారి జన్మదినం సందర్భంగా ఉగ్రరథ శాంతి వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆయురారోగ్యాలు, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. వేద సంప్రదాయాల్లో పూజలు, శాంతి కార్యక్రమాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు.
కార్యక్రమంలో బొడ్ల వెంకటయ్య కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, వేద పండితులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.