37 ఏళ్ల పోలీసు సేవలకు వీడ్కోలు

పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులకు ఘన సన్మానం కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సెప్టెంబరు నెలలో పదవీ విరమణ చేసిన ఏఎస్‌ఐ ఆర్‌. మల్లేశం, సీనియర్‌ అసిస్టెంట్‌ డి. రాధాకృష్ణరెడ్డిలను అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీసుశాఖలో 37 ఏళ్ల పాటు వారు అందించిన సేవలను అడిషనల్‌ డీసీపీ అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి సేవలను పోలీసుశాఖ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో...