CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:29 am Posted by : CHAITHANYA GALAM NEWS

37 ఏళ్ల పోలీసు సేవలకు వీడ్కోలు

  • పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులకు ఘన సన్మానం

కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సెప్టెంబరు నెలలో పదవీ విరమణ చేసిన ఏఎస్‌ఐ ఆర్‌. మల్లేశం, సీనియర్‌ అసిస్టెంట్‌ డి. రాధాకృష్ణరెడ్డిలను అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా పోలీసుశాఖలో 37 ఏళ్ల పాటు వారు అందించిన సేవలను అడిషనల్‌ డీసీపీ అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి సేవలను పోలీసుశాఖ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలిపారు.

కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.