జిల్లా ఛాంపియన్లకు అభినందనలు

జాతీయస్థాయి యోగా పోటీల్లో రాణించాలి: కన్న కృష్ణ కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): ఇటీవల కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్‌ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులను జిల్లా యోగా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ అభినందించారు. కరీంనగర్‌లోని తారక హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. అక్టోబరు 3 నుంచి 6 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జాతీయస్థాయి యోగా పోటీలు జరగనున్నట్లు...