CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:40 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఫోర్ లైన్ రోడ్లపై గ్రామస్తుల ఆందోళన

  • 300 కుటుంబాలకు ఇళ్లు కోల్పోయిన పరిస్థితి

చిగురుమామిడి,అక్టోబర్ 1(చైతన్యగళం)

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల కేంద్రంలో కొత్తపల్లి – హుస్నాబాద్ ఫోర్‌ లైన్ రహదారి నిర్మాణం పై ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రిలే నిరహార దీక్ష చేపట్టారు. రహదారి ఫోర్‌ లైన్ నిర్మాణంతో గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 300 కుటుంబాలు ఇండ్లు కోల్పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. కష్టపడి కట్టుకున్న ఇండ్లు కోల్పోతే తాము, తమ కుటుంబాలు రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కూల్చివేతకు గురవుతున్న బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకపోతే ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.