నారాయణపూర్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దు: కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్, అక్టోబరు 1 (చైతన్యగళం): నారాయణపూర్ రిజర్వాయర్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 100 శాతం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. గ్రామస్తులు అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రిజర్వాయర్ ప్రభావం, ముంపు పరిస్థితులు, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ప్రజా సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. చొప్పదండి...