వింజపల్లి పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్‌ అన్నాడి శ్రీజ–జీవన్‌రెడ్డి కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): మండలంలోని వింజపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ అన్నాడి శ్రీజ–జీవన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతోపాటు వారి ఆరోగ్యం, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో నాణ్యమైన అల్పాహారం అందించడం అభినందనీయమని సర్పంచ్‌ పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో మరింతగా రాణించగలరని,...