CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:19 am Posted by : CHAITHANYA GALAM NEWS

గడివేముల మండలంలో విద్యా కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

  • బూజనూరులో చైర్మన్‌గా కోర నారాయణ.. ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఈశ్వర్‌రెడ్డి

గడివేముల, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): గడివేముల మండలం బూజనూరు గ్రామంలో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. మండల టీడీపీ అధ్యక్షుడు పంట దిలీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా కోర నారాయణ, వైస్‌ చైర్మన్‌గా గంగారపు రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఆళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా బూజనూరు గ్రామానికి చెందిన షమీమ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లకు నాయకులు, పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.