పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

సఫాయిమిత్ర సురక్షా సన్మానం.. ఉచిత వైద్య శిబిరం షాద్‌నగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గనూర్‌ బసవేశ్వర్‌ అన్నారు. 5వ ఏబీ దినోత్సవం సందర్భంగా షాద్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సఫాయిమిత్ర సురక్షా సన్మానం’ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు...