ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలి

దసరా సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి: టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి హనుమకొండ, సెప్టెంబరు 30 (చైతన్యగళం): ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేసి దసరా సెలవుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం హనుమకొండలో నిర్వహించిన తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేసి 50...