చింతపల్లిలో ఘనంగా సేవా సంకల్ప్‌ అభియాన్‌

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ.. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి: కుమారస్వామి చింతపల్లి, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా చింతపల్లి మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్‌ సూచనల మేరకు చింతపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు కుమారస్వామి ముఖ్యఅతిథిగా...