CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:28 am Posted by : CHAITHANYA GALAM NEWS

చింతపల్లిలో ఘనంగా సేవా సంకల్ప్‌ అభియాన్‌

  • వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ.. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి: కుమారస్వామి

చింతపల్లి, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా చింతపల్లి మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్‌ సూచనల మేరకు చింతపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు కుమారస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సేవా సంకల్ప్‌ అభియాన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని కోరారు. అక్టోబరు 4న రహదారి భద్రత, రాకపోకలపై అవగాహన, అక్టోబరు 9న అవయవదానంపై అవగాహన, అక్టోబరు 11న గ్రామాలు, బస్తీలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అనుభవాలను చిత్రీకరించి ప్రచారం చేయాలని కోరారు.

సేవ, సంక్షేమం, ప్రజాభాగస్వామ్యంతో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువతతో పాటు మహిళలు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సివర్ల రమేష్‌యాదవ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుకుడపు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి యనం శేఖర్‌, వార్డు సభ్యులు నల్ల సైదులు, సోమరాజు ప్రదీప్‌, గజ్జి అభినవ్‌, దండేటికారు మహేష్‌, గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు సైదులు, మోహన్‌రెడ్డి, ఎస్‌.ఎస్‌.చారి తదితరులు పాల్గొన్నారు.