రెడ్‌క్రాస్‌ సొసైటీలో పారదర్శకతకు తూట్లు

ఏళ్లుగా జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించలేదని ఆరోపణ.. రికార్డులు బహిర్గతం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): ప్రజాసేవ, మానవతా సేవల కోసం ఏర్పడిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ జిల్లా శాఖలో పరిపాలన పారదర్శకంగా సాగడం లేదని అడ్వకేట్‌, మాజీ కార్పొరేటర్‌ ఎ.వి. రమణ ఆరోపించారు. ఏళ్ల తరబడి వార్షిక సర్వసభ్య సమావేశాలు సక్రమంగా నిర్వహించలేదని సభ్యుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించకపోవడంతో సొసైటీ కార్యకలాపాలు, నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ–వ్యయ...