ప్రకృతి సేద్యంతోనే నాణ్యమైన పంటల దిగుబడి
రసాయన రహిత సాగుతో ఆరోగ్యకరమైన ఆహారం: ఏఈఓ రాజ్‌కుమార్ నిర్మల్, సెప్టెంబరు 30 (చైతన్యగళం): రసాయన మందుల విచక్షణారహిత వినియోగంతో పండించిన పంటలను తీసుకోవడం వల్ల వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మాదాపూర్ క్లస్టర్ ఏఈఓ రాజ్‌కుమార్ అన్నారు. రసాయన రహితంగా చేపట్టే ప్రకృతి సేద్యంతో నాణ్యమైన పంటల దిగుబడి సాధించవచ్చని తెలిపారు. బుధవారం లోకల్ వెల్మల్ గ్రామపంచాయతీలో ప్రకృతి సేద్యం ప్రాజెక్టులో భాగంగా వేస్ట్ డీకంపోజర్ తయారీ విధానంపై సర్పంచ్ చాతిరి గంగాధర్ అధ్యక్షతన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....