మృతుల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్
బీజేపీ నాయకుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా హుస్నాబాద్, సెప్టెంబరు 30 (చైతన్యగళం): బీజేపీ హుస్నాబాద్ మాజీ మండల అధ్యక్షుడు వేముల ప్రభాకర్‌రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ పరామర్శించారు. బుధవారం పోట్లపల్లిలోని ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన.. భార్య సరళ, కుమారుడు కృష్ణారెడ్డిని ఓదార్చారు. ప్రభాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని కూడా బండి సంజయ్...