CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 6:26 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మృతుల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్‌

  • బీజేపీ నాయకుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా

హుస్నాబాద్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): బీజేపీ హుస్నాబాద్‌ మాజీ మండల అధ్యక్షుడు వేముల ప్రభాకర్‌రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. బుధవారం పోట్లపల్లిలోని ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన.. భార్య సరళ, కుమారుడు కృష్ణారెడ్డిని ఓదార్చారు. ప్రభాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అదే గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని కూడా బండి సంజయ్‌ పరామర్శించారు. ఆయన భార్య ప్రమీల, కుమారులు శ్రీనివాస్‌, సుధాకర్‌, వెంకటేశ్వర్లు, వైకుంఠంను ఓదార్చారు. అనంతరం హుస్నాబాద్‌ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్‌ తల్లి అనసూర్య మృతిపై ఆయనను పరామర్శించారు.

కార్యక్రమంలో కరీంనగర్‌ మేయర్‌ కోలాగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.