22/ఏ భూముల సమస్యపై భూబాధితుల ఆందోళన..సీఎం పర్యటన నేపథ్యంలో జేఏసీ నాయకుల ముందస్తు అరెస్టులు

కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్‌ పర్యటన నేపథ్యంలో కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్‌ ప్రాంతాలకు చెందిన భూబాధితుల జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తమ భూ సమస్యపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమైన తమను ఉదయం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్‌ ప్రాంతాలకు చెందిన సుమారు 800 ఎకరాల భూములు 22/ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో దాదాపు 10 వేల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు....