కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):
ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన సందర్భంగా రేపు సెప్టెంబర్ 30, బుధవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ తెలిపారు. ప్రతిమ థియేటర్ టీ జంక్షన్ నుంచి మమత థియేటర్ మీదుగా భగత్‌నగర్ టీ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు.