- వేగంగా స్పందించిన హుస్నాబాద్ పోలీసులు
హుస్నాబాద్, సెప్టెంబరు 29 (చైతన్యగళం): పట్టణంలో పోగొట్టుకున్న రెండున్నర తులాల నల్లపూసల గొలుసును పోలీసులు 14 గంటల్లోనే గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి గొలుసును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్ సంజీవ్‌ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు వేగంగా స్పందించి గొలుసును తిరిగి అందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.