శ్రీ చైతన్యలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారం

నాయకత్వ లక్షణాలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలి: అజయ్‌ సారధి మహబూబాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): మహబూబాబాద్‌ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల–1 శాఖలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అజయ్‌ సారధి నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అజయ్‌ సారధి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్‌ లక్ష్యాలను...