CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 11:17 am Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ చైతన్యలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారం

  • నాయకత్వ లక్షణాలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలి: అజయ్‌ సారధి

మహబూబాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): మహబూబాబాద్‌ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల–1 శాఖలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అజయ్‌ సారధి నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అజయ్‌ సారధి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని, నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విద్యార్థులు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

స్కూల్‌ హెడ్‌బాయ్‌గా జీతూవర్ధన్‌, హెడ్‌గర్ల్‌గా భవిష్య, డిప్యూటీ హెడ్‌బాయ్‌గా సైఫ్‌ఖాన్‌, డిప్యూటీ హెడ్‌గర్ల్‌గా ధృవిత, స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా శ్రీతన్‌, సీసీఏ కెప్టెన్‌గా హన్సిక మలాని బాధ్యతలు స్వీకరించారు. కింగ్స్‌ హౌస్‌ కెప్టెన్‌గా పీయూష్‌ లోయ, డిప్యూటీగా తపస్వి, రాయల్స్‌ కెప్టెన్‌గా హస్నెన్‌, డిప్యూటీగా భవజ్ఞ చౌహాన్‌, ఫారోస్‌ కెప్టెన్‌గా అనాస్‌, డిప్యూటీగా కార్తీక్‌రెడ్డి, సీజర్స్‌ కెప్టెన్‌గా హర్ష, డిప్యూటీగా సాహితీ ప్రమాణం చేశారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ మదార్‌, డీన్‌ విద్యాసాగర్‌, సి-బ్యాచ్‌ ఇన్‌చార్జి మల్లేశం, కుమారస్వామి, సురంభ, ఏవో సుధాకర్‌, పీఈటీలు యాకయ్య, రాకేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.