మహిళా సమాఖ్యకు నూతన పాలకవర్గం ఎన్నిక
సిద్దిపేట, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా మహిళా సమాఖ్య సమావేశం అడిషనల్ డిఆర్డిఓ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వినోద్ కుమార్ హాజరై మహిళలకు సంబంధించిన ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. అడిషనల్ డిఆర్డిఓ సుధీర్ కుమార్ మాట్లాడుతూ భవనాలు లేని గ్రామ సంఘాలు భవనాల నిర్మాణానికి స్థలాలను త్వరగా...