CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సర్వాయిపేట రైతు సంఘం కమిటీ ఏర్పాటు

సైదాపూర్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): సైదాపూర్‌ మండలం సర్వాయిపేట గ్రామపంచాయతీ పరిధి రైతుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. శివరాంపల్లి బతుకమ్మ గడ్డ సమీపంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షుడిగా సంపత్‌ సంజీవరెడ్డి, అధ్యక్షుడిగా కొనుపుల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా చెన్నబోయిన శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా గోడుగబాబు, కార్యదర్శిగా జెల్ల మొగిలి, సహకార కార్యదర్శిగా గొట్టె రమేష్‌, కోశాధికారిగా సయ్యద్‌ సర్దార్‌ ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా కోడం ప్రభాకర్‌, బోగం వెంకటయ్య, ముత్యాల కొమురయ్య, ఎనుగుల సదయ్య, వేముల మహేశ్వర్‌, బొల్లి శ్రీనివాస్‌, బోలుమల్ల ఓదెలు ఎంపికయ్యారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.