ప్రతి రైతు రైతు గుర్తింపు కార్డు పొందాలి

సెప్టెంబరు 30లోగా నమోదు చేసుకోవాలి: వ్యవసాయ అధికారి పూజ హుస్నాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): ప్రతి రైతు రైతు గుర్తింపు కార్డు పొందాలని హుస్నాబాద్‌ వ్యవసాయ అధికారి పూజ సూచించారు. మంగళవారం హుస్నాబాద్‌ రైతు వేదికలో రైతు గుర్తింపు కార్డుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంటల నమోదు, పంటల విక్రయాలు, యూరియా బుకింగ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు రైతు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధార్‌ కార్డు తరహాలో ప్రతి రైతుకు ఈ గుర్తింపు కార్డు...