CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:53 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రతి రైతు రైతు గుర్తింపు కార్డు పొందాలి

  • సెప్టెంబరు 30లోగా నమోదు చేసుకోవాలి: వ్యవసాయ అధికారి పూజ

హుస్నాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): ప్రతి రైతు రైతు గుర్తింపు కార్డు పొందాలని హుస్నాబాద్‌ వ్యవసాయ అధికారి పూజ సూచించారు. మంగళవారం హుస్నాబాద్‌ రైతు వేదికలో రైతు గుర్తింపు కార్డుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పంటల నమోదు, పంటల విక్రయాలు, యూరియా బుకింగ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు రైతు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధార్‌ కార్డు తరహాలో ప్రతి రైతుకు ఈ గుర్తింపు కార్డు ఉండేలా ప్రభుత్వం విధానం తీసుకొచ్చిందన్నారు.

హుస్నాబాద్‌ మండలంలో ఇప్పటివరకు 80 శాతం మంది రైతుల నమోదు పూర్తయిందని, మిగిలిన 20 శాతం మంది రైతులు సమీప వ్యవసాయ విస్తరణ అధికారి, మీ సేవ కేంద్రం లేదా సహకార సంఘాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబరు 30 చివరి తేదీ కావడంతో అర్హులైన రైతులంతా గడువులోగా నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.