- సొంత ఖర్చులతో నిర్మించి గ్రామానికి అంకితం చేసిన ఉండెల ఈశ్వర్ దంపతులు
కందుకూరు, సెప్టెంబరు 29 (చైతన్యగళం): తల్లిదండ్రుల జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేందుకు కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన ఉండెల ఈశ్వర్, వనజా దంపతులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ తల్లిదండ్రులు కీ.శే. ఉండెల వెంకటమ్మ, కీ.శే. ఉండెల రామయ్యల జ్ఞాపకార్థం గ్రామంలో సొంత ఖర్చులతో అంబేద్కర్ పేరుతో కమాన్‌ను నిర్మించి మంగళవారం గ్రామానికి అంకితం చేశారు.
కుటుంబ సభ్యులు, యువత, మహిళల సమక్షంలో కమాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉండెల ఈశ్వర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చేసిన మేలుకు ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేమని, వారి జ్ఞాపకార్థం ఈ కమాన్‌ను నిర్మించినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల స్మృతిలో గ్రామానికి ఉపయోగపడే విధంగా కమాన్‌ను నిర్మించి అంకితం చేయడాన్ని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏర్పుల నరేష్ పాల్గొన్నారు.