రేపు నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవనం వద్ద పూల అలంకరణ, పరిశుభ్రత, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌ను...