CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:55 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభకు తరలిరావాలి

  • కాంగ్రెస్‌ శ్రేణులకు మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌ పిలుపు

కోహెడ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): సిరిసిల్లలో బుధవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన, బహిరంగ సభకు కోహెడ మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌ కోరారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా, రైతులకు బోనస్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి సీఎం పాదయాత్ర నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. నేతన్నల సమస్యలు, పాత బకాయిల చెల్లింపుతో పాటు చేనేత, పవర్‌లూమ్‌ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించేందుకు పర్యటన జరుగుతుందని చెప్పారు. సభకు తరలివచ్చేందుకు మండలంలోని ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక బస్సు కేటాయించినట్లు శెట్టి సుధాకర్‌ తెలిపారు.