ఆర్ఎఫ్‌సీఎల్‌ విషయంలో కేంద్రం విఫలం

పెద్దపల్లి, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్‌) నిర్వహణ, కార్యకలాపాలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ రైతులకు కీలకమైన ఎరువుల ఉత్పత్తి సంస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘మేక్ ఇన్ ఇండియా కాదు.. ఫేక్ ఇన్ ఇండియా’గా మారిందంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతూ బీఎస్‌ఎన్‌ఎల్, ఇస్రో, డీఆర్‌డీఓతో పాటు తన నియోజకవర్గంలోని ఆర్ఎఫ్‌సీఎల్‌...