హిందూ దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన
రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్.. పోలీసులతో తోపులాట మహబూబాబాద్, సెప్టెంబరు 29 (చైతన్యగళం): హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మానుకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి నెహ్రూ సెంటర్ వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెహ్రూ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి...