307 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని హనుమాన్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లు యజమాని టి. కరుణాకర్, తండ్రి జగన్నాథం, అశోక్‌నగర్, కరీంనగర్ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 307 క్వింటాళ్ల (30 టన్నుల 3 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్...