సిరిసిల్ల సభకు కరీంనగర్ నుంచి వేలాదిగా తరలివెళ్తాం
సీఎం సభను విజయవంతం చేస్తాం: కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు కరీంనగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ఈనెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాదిమందితో తరలివెళ్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు. సోమవారం సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సభ ఏర్పాట్లు, ప్రజల తరలింపు తదితర అంశాలపై వారితో చర్చించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులను పెద్ద...