ప్రజలకు నాణ్యమైన మంచినీరు అందించడమే లక్ష్యం

బాలవికాస వాటర్‌ ప్లాంట్ల సమైక్య జోనల్‌ సమావేశంలో కేడం లింగమూర్తి హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే బాలవికాస సంస్థ ప్రధాన లక్ష్యమని బాలవికాస వాటర్‌ ప్లాంట్ల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బాలవికాస వాటర్‌ ప్లాంట్ల సమైక్య జోనల్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 1,600 వాటర్‌ ప్లాంట్లు నిర్వహిస్తున్నట్లు లింగమూర్తి తెలిపారు. సమావేశంలో 70 గ్రామాలకు చెందిన వాటర్‌ ప్లాంట్ల కమిటీ...