CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 9:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజలకు నాణ్యమైన మంచినీరు అందించడమే లక్ష్యం

  • బాలవికాస వాటర్‌ ప్లాంట్ల సమైక్య జోనల్‌ సమావేశంలో కేడం లింగమూర్తి

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే బాలవికాస సంస్థ ప్రధాన లక్ష్యమని బాలవికాస వాటర్‌ ప్లాంట్ల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బాలవికాస వాటర్‌ ప్లాంట్ల సమైక్య జోనల్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 1,600 వాటర్‌ ప్లాంట్లు నిర్వహిస్తున్నట్లు లింగమూర్తి తెలిపారు. సమావేశంలో 70 గ్రామాలకు చెందిన వాటర్‌ ప్లాంట్ల కమిటీ సభ్యులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ప్లాంట్ల ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో సేవలను మరింత విస్తరించి, ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐలేని మల్లికార్జున్‌రెడ్డి, బాలవికాస సంస్థ మేనేజర్‌ మధుసూదన్‌, జోనల్‌ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.