నశా ముక్త్‌ ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు సోమవారం ప్రతిజ్ఞ చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ అవగాహన కార్యక్రమంలో ఈ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడిన వారిని నేరస్తులుగా చూడకుండా వైద్యం, కౌన్సెలింగ్‌, పునరావాసం ద్వారా సాధారణ జీవనంలోకి తీసుకురావాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి,...