విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలి: సీఎస్‌ సంజయ్‌ జాజు కరీంనగర్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సూచించారు. విద్యార్థుల భద్రత, హాజరు, భోజనం, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల పనితీరు, అభ్యసన ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో...