శరన్నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన పారిజాత నరసింహరెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(చైతన్యగళం): ఆదిత్యనగర్‌ బతుకమ్మ కూడలి వద్ద నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాల ఆహ్వాన పత్రికను చిగురింత పారిజాత నరసింహరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో పాటు దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో భవానీ భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు దండు నరేష్‌, పగిడోజు ప్రవీణ్‌, నేనావత్‌ బాలాజీ, జటావత్‌ సురేందర్‌, మట్ట మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...