కృష్ణజింకను వేటాడి మాంసంతో పట్టుబడ్డ తొమ్మిది మంది
పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ సంయుక్త ఆపరేషన్.. తుపాకీ, 13 కిలోల మాంసం స్వాధీనం షాద్‌నగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): కృష్ణజింకను వేటాడి దాని మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలపై తొమ్మిది మందిని పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి .315 రైఫిల్, టెలిస్కోప్, సైలెన్సర్, 19 బుల్లెట్లు, సుమారు 13 కిలోల కృష్ణజింక మాంసం, రెండు వాహనాలు, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.28,590 నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు షాద్‌నగర్ డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు. సోమవారం షాద్‌నగర్ డీసీపీ...